గుంటూరు జిల్లా,ప్రత్తిపాడు మండలం,యణమదల గ్రామంలో వేంచేసివున్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం కోనేరు పరిరక్షణలో కృతకృత్యులైన హైందవశక్తి.
Victory
GUNTUR
29-09-2020
Protecting Temples From Attacks
PRATHIPADU
ANDHRA PRADESH
ENAMADALA
Description:
గుంటూరు జిల్లా,ప్రత్తిపాడు మండలం,యణమదల గ్రామంలో వేంచేసివున్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం((రెండవ భద్రాద్రి అని పేరు గాంచింది.)) తాలూకు భూములు అందునా మరి ముఖ్యంగా కోనేరు అన్యాక్రాంతం అయ్యింది. అదే గ్రామానికి చెందిన మన హైందవశక్తి సభ్యుడు జింకా.బాజిబాబు స్థానిక ప్రజల మద్దత్తు కూడగట్టి సంతకాలు సేకరించి రకరకాల స్థాయిలలో((పంచాయతీ రాజ్ శాఖ,దేవాదాయ ధర్మాదాయ శాఖా అసిస్టెంట్ కమీషనర్,కమీషనర్, జిల్లా కలెక్టర్,సమాచారహక్కు చట్టం - 2005 ను ఉపయోగిస్తూ)) ప్రభుత్వ యంత్రాంగం పై ఫిర్యాదులు చేసి 3 నెలలు పైనే చట్టపరమైన పోరాటం చేసి అనుకున్న విజయం సాధించాము. స్పెషల్ కమీషనర్ - ఇండోన్మెంట్స్ వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ((గ్రామ కంఠంలో ఉన్న కొనేరును దేవ స్థానం ట్రస్ట్ కి అప్ప చెప్పి ,కొనేరును అభివృద్ధి చేసేలా))గుంటూరు డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి వారు యణమదల గ్రామ పంచాయతీకి ఉత్తర్వులు జారీ చేయాలి.((అప్పుడు దేవస్థానం ట్రస్ట్ వారు కోనేరు ఆక్రమణలను తొలగించి పునర్ వైభవం తెస్తారు)). ఈ ధర్మ రక్షణలో చట్టపరమైన పోరాటం చేసి,ఇంతటి ఘాన విజయాన్ని సాధించిన జింకా. బాజీ బాబు,అతనికి తోడు నిలిచిన హైందవశక్తి ఇద్దరూ ప్రశంసనీయులే.